Social 1080×1350 • Multi-page
23-06-2024 BREAKING NEWS 06:58 AM
swarnodayam.com
Telugu Daily News

రాజపల్లిలో ఉచిత గుండె వైద్య శిభిరంకు చక్కని స్పందన..!

రాజపల్లిలో ఉచిత గుండె వైద్య శిభిరంకు చక్కని స్పందన..!
IMG-20240623-WA0089

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: నెహ్రూ యువ కేంద్రం కరీంనగర్ ఆధ్వర్యంలో యువశక్తి యూత్ అసోసియేషన్ రాజపల్లి వారు ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిభిరంకు ప్రజల నుండి చక్కన స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. భగీరథ్ మరియు వారి టీమ్ వచ్చి ఉచితంగా ఓపి, బిపి, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయంతం చేసినందుకు యువ శక్తి యూత్ అసోసియేషన్ అధ్యక్షులు మునిగాల అశోక్ గ్రామ ప్రజలకు మరియు డా. భగీరథ్ కి మరియు వారి టీమ్ మెంబర్స్ భరత్ రెడ్డి, వెంకటేష్, చరణ్ తేజ, కావ్య, మధు, వందన, వైష్ణవికి కృతజ్ఞతలు తెలిపారు. యువ శక్తి యూత్ అసోసియేషన్ వారు డా. భగీరథ్ ను అనంతరం శాలువాతో సన్మానించి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ఉచిత గుండె వైద్య శిబిరం కు ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!