Social 1080×1350 • Multi-page
24-06-2024 BREAKING NEWS 01:08 AM
swarnodayam.com
Telugu Daily News

రామగుండం ఎమ్మెల్యేను కలిసిన రామగుండం టీఆర్ఆర్ఎస్ కమిటీ

రామగుండం ఎమ్మెల్యేను కలిసిన రామగుండం టీఆర్ఆర్ఎస్ కమిటీ
IMG-20240624-WA0087

స్వర్ణోదయం ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ ని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మొదటిసారి ఆయనను కలవడంతో పుష్ప గుచ్చాలు ఇచ్చి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోడిపుంజుల చంద్రయ్య, కళామండళి రాష్ట్ర అధ్యక్షులు ఎజ్జ రాజయ్య, రాష్ట్ర కార్యదర్శి ముక్కెర రాజేశం, జిల్లా మహిళా అధ్యక్షురాలు మడికొండ ఓదక్క, రేణుక, రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కాసర్ల సురేష్, ప్రధాన కార్యదర్శి మునిగంటి సంపత్, టేల అసోసియేషన్ అధ్యక్షులు కోడిపుంజుల మధు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!