24-06-2024 NORMAL NEWS 02:18 AM
swarnodayam.com
Telugu Daily News
24-06-2024 02:18 AM By Mandala Yadagiri

ఫ్లాష్ ఫ్లాష్.. తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఫ్లాష్ ఫ్లాష్.. తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
Screenshot_20240623-184528_Lokal

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలి, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు పర్యాటక శాఖ క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్, చేనేత, హస్తకళల ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్య, హ్యాండ్లూమ్స్‌, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్‌ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు,అటవీ, పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శిగా అహ్మద్‌ నదీమ్‌, టీపీటీఆర్‌ఐ డీజీగా అహ్మద్‌ నదీమ్‌కు అదనపు బాధ్యతలు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియా, ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియాకు అదనపు బాధ్యతలు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా కొనసాగనున్న సందీప్‌, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ ముఖ్యకార్యదర్శిగా రిజ్వి, జీఏడీ ముఖ్యకార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి, హౌసింగ్‌, రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ ముఖ్యకార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రసాద్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీగా సోనీ బాలాదేవి, రవాణాశాఖ కమిషనర్‌గా కె.ఇలంబరితి, విద్యుత్‌శాఖ కార్యదర్శిగా రొనాల్డ్‌ రోస్,జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీగా రొనాల్డ్‌ రోస్‌కు అదనపు బాధ్యతలు, జీహెచ్‌ఎంసీ, విజిలెన్స్‌, విపత్తు నిర్వహణ కమిషనర్‌గా రంగనాథ్‌ ,కళాశాల, సాంకేతిక విద్యాశాఖల కమిషనర్‌గా శ్రీదేవసేన, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్‌ అహ్మద్‌, సెర్ప్‌ సీఈవోగా డి.దివ్య, ప్రజావాణి నోడల్‌ అధికారిగా దివ్యకు అదనపు బాధ్యతలు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు, రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక కార్యదర్శిగా హరిచందన, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ఎన్.ప్రకాష్‌రెడ్డి, ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా అలగ్‌వర్షిణి, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా వి.పి.గౌతమ్‌, పురపాలక శాఖ డైరెక్టర్‌గా గౌతమ్‌కు అదనపు బాధ్యతలు, ఉపాధి, శిక్షణ శాఖల డైరెక్టర్‌గా కృష్ణా ఆదిత్యకు అదనపు బాధ్యతలు, జలమండలి ఎండీగా కె.అశోక్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా అనురాగ్‌ జయంతి, ఐటీ ఉపకార్యదర్శిగా భవేష్‌ మిశ్రా, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా జి.రవి, గ్రామీణాభివృద్ధి సీఈవోగా కె.నిఖిల, ఉద్యానవన డైరెక్టర్‌గా యాస్మిన్‌ బాషా, ఆయిల్‌ఫెడ్‌ ఎండీగా యాస్మిన్‌ బాషాకు అదనపు బాధ్యతలు, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌గా ఎస్‌.వెంకట్రావు, వ్యవసాయ,సహకార సంయుక్త కార్యదర్శిగా జి.ఉదయ్‌కుమార్‌, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌గా గోపికి అదనపు బాధ్యతలు, ఫిషరీస్‌ డైరెక్టర్‌గా ప్రియాంక, టూరిజం డైరెక్టర్‌గా ఐలా త్రిపాఠి, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా స్నేహా శబరి, రాష్ట్ర ఆర్థికసంఘం ఎండీగా కాత్యాయని దేవి
పాఠశాల విద్యా డైరెక్టర్‌గా నర్సింహారెడ్డి, సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నర్సింహారెడ్డికి అదనపు బాధ్యతలు, వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా సహదేవరావు, జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌గా హెచ్‌.కె. పాటిల్, జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా అపూర్వ్‌ చౌహన్‌,ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా అభిషేక్ అగస్త్య, భద్రాచలం ఐటీడీఏ పీవోగా రాహుల్‌, మూసీ అభివృద్ధి జేఎండీగా గౌతమి, జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌గా ఉపేందర్‌రెడ్డి, టీజీ ఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నిఖిల్ చక్రవర్తి నేమిస్తూ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!