24-06-2024 NORMAL NEWS 06:34 AM
swarnodayam.com
Telugu Daily News
24-06-2024 06:34 AM By Mandala Yadagiri

మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు దృష్టికి హుజురాబాద్ జిల్లా సాధన అంశం…కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇన్ ఛార్జ్ ప్రణవ్ హామీ

మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు దృష్టికి హుజురాబాద్ జిల్లా సాధన అంశం…కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇన్ ఛార్జ్ ప్రణవ్ హామీ
IMG-20240624-WA0135

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


పీవీ హుజురాబాద్ జిల్లా సాధన స్టీరింగ్ కమిటీ సభ్యులు సోమవారం ఉదయం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితెల ప్రణవ్ ను కలిసి జిల్లా సాధన అంశాన్ని చర్చించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ జిల్లా సాధన అంశాన్ని రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో చర్చించానని వారు త్వరలో జిల్లా సాధన జేఏసీ కమిటీ సభ్యులను తీసుకువెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించేందుకు హామీ ఇచ్చారని తెలిపారు. కావున తప్పనిసరిగా నేను కూడా జిల్లా సాధన జేఏసీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు వస్తానని జేఏసీ నాయకులకు హామీ ఇచ్చారు. ప్రణవ్ ను కలిసిన వారిలో హుజురాబాద్ జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ భీమోజు సదానందం, సైదాపూర్ మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకటరాజం , తాటిపల్లి రాజన్న, వేల్పుల రత్నం, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సొల్లు బాబు, తాళ్లపల్లి రమేష్, డాక్టర్ విష్ణుదాస్ గోపాలరావు, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, మార్త రవీందర్ , మిడిదొడ్డి శ్రీనివాస్, ఎలబోతారం మాజీ సర్పంచ్ నమిండ్ల రవీందర్, రాం రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!