Social 1080×1350 • Multi-page
24-06-2024 BREAKING NEWS 10:49 AM
swarnodayam.com
Telugu Daily News

కేర‌ళ కాదు ఇకనుంచి కేర‌ళం.. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం.. చట్టంగా ఆమోదం!

కేర‌ళ కాదు ఇకనుంచి కేర‌ళం.. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం.. చట్టంగా ఆమోదం!
IMG-20240624-WA0179

స్వర్ణోదయం ప్రతినిధి తిరువనంతపురం: కేర‌ళ రాష్ట్ర పేరును కేర‌ళంగా మార్చాల‌ని కోరుతూ ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఆ రాష్ట్ర సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ఆ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌తిప‌క్షాల‌తో పాటు అంద‌రూ ఏక‌ప‌క్షంగా ఆ తీర్మానాన్ని ఆమోదించారు. పేరు మార్పున‌కు చెందిన తీర్మానాన్ని ఆమోదం కోసం త్వ‌ర‌లో కేంద్రానికి పంప‌నున్నారు. గ‌త ఏడాది ఆగ‌స్టులో కూడా ఇదే త‌ర‌హా తీర్మానం చేసి కేంద్రానికి పంపిన‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తు చేసింది. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఇకనుండి భారతదేశ చిత్రపటంలో కేరళముగా ఆ రాష్ట్రాన్ని పిలుచుకోబడుతుంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!