Social 1080×1350 • Multi-page
24-06-2024 BREAKING NEWS 12:46 PM
swarnodayam.com
Telugu Daily News

నువ్వా నేనా అన్నట్లుగా లీడర్లు..సవాలుకు సిద్ధమైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…రేపు చెల్పూర్ లో ఏం జరుగబోతోంది !?

నువ్వా నేనా అన్నట్లుగా లీడర్లు..సవాలుకు సిద్ధమైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…రేపు చెల్పూర్ లో ఏం జరుగబోతోంది !?
Screenshot_20240525-221715_Chrome

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సవాల్ ప్రతి సవాల్ తో కాంగ్రెస్- బిఆర్ఎస్ పార్టీలో నాయకులు రేపు చెల్పూర్ గ్రామంలో సిద్ధం కాగా అక్కడ ఏం జరుగుతుందోనని సర్వ త్రా ఉత్కంఠ నెలకొన్నది. ముందుగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితెలా ప్రణవ్ చెల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని సవాలు విసరగా నేను దానికి సిద్ధమైన అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. కాంగ్రెస్ గడువు కంటే గంట ముందే చేల్పూర్ హనుమాన్ ఆలయంకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వస్తానని, బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు ఇచ్చారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు వస్తానంటూ ప్రణవ్ సవాల్ చేయడమే కాక ఆధారాలతో నిరూపిస్తానని వెల్లడించడంతో రేపు చెల్పూర్ కు ఇరు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు వేల సంఖ్యలో రానుండడతో ఏం జరుగబోతోంది ..!? నువ్వా నేనా అన్నట్లుగా లీడర్లు తొడలు కొడుతుండడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో టెన్షన్ టెన్షన్…నెలకొంది. అయితే భద్రత దృష్ట్యా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను, నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!