Social 1080×1350 • Multi-page
25-06-2024 BREAKING NEWS 07:53 AM
swarnodayam.com
Telugu Daily News

నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మ దహనం..మోడీ హటావో దేశ్ కో బచావో ఎన్ఎస్ యుఐ..!

నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మ దహనం..మోడీ హటావో దేశ్ కో బచావో ఎన్ఎస్ యుఐ..!
IMG-20240625-WA0108

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: 24 లక్షల మంది నీట్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మరియు NTA ఈరోజు జమ్మికుంటలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎన్ ఎస్ యుఐ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష ఎగ్జామ్ పేపర్ లీకేజీ వ్యవహారం జరిగి నెల రోజులు కావస్తున్నా నిమ్మకు నీరెత్తనట్లు లేకుండా ఉన్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మని దహనం చేశారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి ఇమ్రాన్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం పై సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. అలాగే నీట్ పరీక్షను రద్దు చేసి, నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్నారు. నీట్ పరీక్ష నిర్వహించడంలో NTA విఫలమైంది కాబట్టి NTA ని బ్యాన్ చేయాలనీ, నీట్ విద్యార్థులకు అ పిల్లల తల్లితండ్రులకు కేంద్ర ప్రభుత్వం, మోడీ క్షమాపణ చెప్పాలనీ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షని సమర్ధవంతంగా నిర్వహించలేని కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చెయ్యాలనీ NSUI కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు MD. ఇమ్రాన్ డిమాండ్ ఈ కార్యక్రమంలో NSUI కరీంనగర్ జిల్లా కార్యదర్శి పల్నాటి అభిలాష్, NSUI జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ వంశీ, జమ్మికుంట మండల ప్రెసిడెంట్ అవినాష్, నాయకులు నాగరాజు, జియా ఉల్లా, శివ, సమీర్, నరేష్, రాజేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!