Social 1080×1350 • Multi-page
25-06-2024 BREAKING NEWS 09:52 AM
swarnodayam.com
Telugu Daily News

ముగిసిన స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్ క్రీడా పోటీలు..

ముగిసిన స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్ క్రీడా పోటీలు..
IMG-20240625-WA0134

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో స్పోర్ట్స్ స్కూల్లో నాలుగవ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన క్రీడా పోటీలు మంగళవారం ముగిసినట్లు హుజురాబాద్ మండల విద్యాధికారి కేతిరి వెంకటనరసింహారెడ్డి తెలిపారు. సోమ, మంగళవారాల్లో నాలుగో తరగతి ప్రవేశం కోసం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికైన బాల బాలికలు ఈనెల 27న జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగే పోటీలలో పాల్గొనాలని ఆయన సూచించారు. కాగా క్రీడా పాఠశాల ప్రవేశం కోసం కృషిచేసిన పీడీలు, పీఈటీలను శాలువాలతో ఘనంగా ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్జిఎఫ్ కార్యదర్శి పిడి సొల్లు సారయ్య, ప్రవీణ్ కుమార్, చిరుత శ్రీనివాస్, కే రేణుక, పిఈటిలు వేముల రవికుమార్, భాగ్యలక్ష్మి, సొల్లు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!