26-06-2024 NORMAL NEWS 03:18 AM
swarnodayam.com
Telugu Daily News
26-06-2024 03:18 AM By Mandala Yadagiri

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం..-నీట్ పేపర్ లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలి

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం..-నీట్ పేపర్ లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలి
IMG-20240626-WA0126

-నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలి

-విద్యార్థుల తల్లిదండ్రులకు నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ని నిరసిస్తూ హుజురాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను యవజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ జరిపించాలని, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్ధకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మళ్ళి నీట్ పరీక్ష నిర్వహించాలని, నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ చేసినటువంటి దోషులను కఠినంగా శిక్షించాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సందమల్ల నరేష్, టేకుల శ్రవణ్, జంగ అనిల్, చల్లూరి విష్ణువర్ధన్, ముక్క రవితేజ, కెఆర్ బిక్షపతి, అజయ్, సాయి, రాజేష్, నరేష్, సంజయ్, గణేష్, రాము, అన్వేష్ పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!