Social 1080×1350 • Multi-page
26-06-2024 BREAKING NEWS 07:15 AM
swarnodayam.com
Telugu Daily News

18వ లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి బీజేపీ ఎంపీ ఓం బిర్లా..చరిత్ర సృష్టించిన ఓం బిర్లా!

18వ లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి బీజేపీ ఎంపీ ఓం బిర్లా..చరిత్ర సృష్టించిన ఓం బిర్లా!
IMG-20240626-WA0147

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి బీజేపీ ఎంపీ ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. బుధవారం లోక్‌సభలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థిపై మూజువాణి ఓటుతో విజయం సాధించారు. స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 18వ లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఓం బిర్లా కోటా-బుండి లోక్‌సభ స్థానం నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మోదీ 2.0 ప్రభుత్వంలో లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈసారి కూడా ఎన్ డిఏ ఆయనను లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించింది. ఎన్ డిఎ కి మెజారిటీ ఉంది. ఇతర పార్టీలు కూడా బయటి నుండి ఓం బిర్లాకు మద్దతు పలికారు. దీంతో ఓం బిర్లా రెండవసారి లోక్‌సభ స్పీక‌ర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!