26-06-2024 NORMAL NEWS 07:47 AM
swarnodayam.com
Telugu Daily News
26-06-2024 07:47 AM By Mandala Yadagiri

సిర్సపల్లిలో ఆర్థిక స్వాలంబనపై మహిళలకు అవగాహన..

సిర్సపల్లిలో ఆర్థిక స్వాలంబనపై మహిళలకు అవగాహన..
IMG-20240626-WA0131

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళ సాధికారిక కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ కవిత, ఫైనాన్స్ లిటరసీ రోహిణి హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో బుధవారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మహిళలకు ఆర్థిక స్వాలంబన పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారిక కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ కవిత మాట్లాడుతూ ( లింగ నిర్దారణ చట్టరీత్యా నేరము)
PCPNDT చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే జైలుశిక్ష, 3 నుంచి 5 సంవత్సరాలు వరకు విధిస్తారని, చిన్నపిల్లల పట్ల చిన్నచూపు చూసిన, లింగమార్పిడి పరీక్షలు చేయించిన చట్టరీత్య చర్యలు ఉంటాయన్నారు. ఆడపిల్లలు, మహిళలపై, పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు వాటిపై పని చేస్తున్న చట్టాలు, కోసం పని చేసే సఖి 181 సెంటర్ యొక్క సేవలు, తప్పనిసరి వివాహ నమోదు చట్టం, టోల్ ఫ్రీ నెంబర్స్ గురించి కులంకశంగా వివరించారు.

ఫైనాన్స్ లిట్రసి రోహిణి మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత పై, ఆర్థిక ప్రణాళిక మరియు పొదుపు పై అవగాహన ఉండాలని తెలిపారు. వ్యాపారం చెయ్యాలని ఆలోచన కలిగి ఉండి ఆర్థిక స్తోమత లేక వెనుకంజ వేసే మహిళలకు మహిళా సాధికారిక కేంద్రం ద్వారా సహాయం అందిస్తామని తెలిపారు. మహిళలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మొదలైన అంశాలను గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, వివోఏలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!