Social 1080×1350 • Multi-page
26-06-2024 BREAKING NEWS 08:15 AM
swarnodayam.com
Telugu Daily News

సిరిసేడు ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు..

సిరిసేడు ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు..
IMG-20240626-WA0162

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రతి ఏటా ముదిరాజులు అత్యంత పవిత్రంగా.. ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పెద్దమ్మ తల్లి బోనాలను ఈసారి జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామంలో బుధవారం అంగరంగ వైభవంగా ఇంటింటికి బోనంతో డీజే పాటలతో ఆనందంగా జరుపుకున్నారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ముదిరాజ్ కులస్తులు వేడుకున్నారు. అలాగే చేపలు పట్టడానికి వెళ్లిన సందర్భంలో చెరువులలో ఎటువంటి ఆపదలు ఎదురుకాకుండా ఎటువంటి ఆటంకాలు ఎదురుగాకుండా ఉండాలని, నిండు మనసుతో ఆ పెద్దమ్మతల్లిని వేడుకుంటూ ముదిరాజుల ఆడబిడ్డగా కొలుస్తూ ఆ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ అధ్యక్షులు జెకే, మరియు సిరిసేడు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు రెడ్డి సారంగం, కుల పెద్దమనిషి పుట్ట కుమారస్వామి, ఉపాధ్యక్షులు పుట్ట రాజు,
డైరెక్టర్లు..మరియు బ్యాచ్ పెద్ద మనుషులు పద్మయ్య, చంద్రమౌళి, అశోక్, చిరంజీవి, శివ, రవి, చేరాలు, రాజకోమురయ్య, సాయిలు, రాయమల్లు, రెడ్డి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!