26-06-2024 NORMAL NEWS 10:35 AM
swarnodayam.com
Telugu Daily News
26-06-2024 10:35 AM By Mandala Yadagiri

మత్తుతో జీవితాలు చిత్తు.. యువత మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

మత్తుతో జీవితాలు చిత్తు.. యువత మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
IMG-20240626-WA0156

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: దేశ భవిష్యత్తుకు వెన్నముకగా ఉండే యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలతో యువత జీవితాలు చిత్తు అవుతాయని హుజురాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ మారకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తుకు బానిసైతే అతని జీవితమే కాకుండా కుటుంబ భవిష్యత్తు కూడా పూర్తిగా అంధకారం అవుతుందని తెలిపారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. మత్తుకు యువతి యువకులు బానిస అయితే ఆరోగ్యం పాడవ్వడమే కాకుండా చట్ట ప్రకారం శిక్షలు పడతాయని, భవిష్యత్తు అందాకారంగా మారుతుందని ఎక్సైజ్ సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై టి వినోద్, హుజురాబాద్ ఎస్సై సాంబయ్య గౌడ్, కాకతీయ జూనియర్ కళాశాల డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ముకుందరెడ్డి, పోలీసులు కార్తీక్, బి సంతోష్, రాజశేఖర్, రమేష్, జి రమేష్, శృతి, స్రవంతి, దేవేందర్, తిరుపతి, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!