Social 1080×1350 • Multi-page
27-06-2024 BREAKING NEWS 04:43 AM
swarnodayam.com
Telugu Daily News

నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ అమ్ముతున్న ఏకాశీల స్కూల్ నీ సీజ్ చేయాలి -ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు

నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ అమ్ముతున్న ఏకాశీల స్కూల్ నీ సీజ్ చేయాలి -ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు
IMG-20240627-WA0122

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఏబీవీపీ హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు గురువారం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతూ విద్యను వ్యాపారం చేస్తున్న ఏకాశీల స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని, అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మూసాల విష్ణు ఆధ్వర్యంలో పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సదర్భంగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో లాభార్జనే ధ్యేయంగా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభించినప్పటి నుంచి అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల పైన చర్యలు తీసుకోకుండా మామ మాత్రమే వ్యవహరిస్తున్నారన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో విద్యను వ్యాపారం చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం బాధాకరం అన్నారు. ఇకనైనా ప్రైవేట్ పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి గోసుకుల అజయ్, నగర సంయుక్త కార్యదర్శి అరుణ్, నగర కార్యవర్గ సభ్యులు వరుణ్, శేషు, శ్రీచరణ్, శశాంక్, శివ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!