27-06-2024 NORMAL NEWS 05:50 AM
swarnodayam.com
Telugu Daily News
27-06-2024 05:50 AM By Mandala Yadagiri

హుజురాబాద్ సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల హల్ చల్.. దర్జాగా ఫైల్స్ తీసుకెళ్తున్న ప్రైవేటు వ్యక్తులు.. పట్టించుకోని ఏ ఎల్ ఓ…!?

హుజురాబాద్ సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల హల్ చల్.. దర్జాగా ఫైల్స్ తీసుకెళ్తున్న ప్రైవేటు వ్యక్తులు.. పట్టించుకోని ఏ ఎల్ ఓ…!?
IMG-20240627-WA0164

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు హల్ చల్ చేస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కార్యాలయంలో ఉండాల్సిన కార్యాలయ ఉద్యోగులు సమయానికి ముందే వెళ్లిపోవడంతో కార్యాలయానికి తాళం వేయకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులు కార్యాలయం లోపలికి చొరబడి వారికి కావాల్సన రసీదులను, దరఖాస్తులను తీసుకోవడం పలువురి కంటపడింది. హుజురాబాద్ పట్టణంలోని సహాయ కార్మిక అధికారి కార్యాలయం లో ప్రభుత్వ అధికారులు లేకుండా ప్రయివేట్ వ్యక్తుల చెప్పుచేతల్లో అధికారులు ఉన్నారు అనడానికి గురువారం కనిపించిన దృశ్యమే సాక్ష్యం. కనీసం అధికారుల చేతుల్లో ఉండాల్సిన కార్యాలయం తాళాలు ప్రైవేట్ వ్యక్తులు(న్యాఖ్ ఉద్యోగుల మని) తాళం తీసి లోపలికి చొరబడడం, వారికి కావలసిన దస్తావేజులు(ఫైల్స్) తీసుకోవడం బట్టి చూస్తే కార్యాలయం దుస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ కార్యాలయంపై అనేక ఫిర్యాదులు పోయిన జిల్లా కార్మిక శాఖా అధికారులు పట్టిచ్చుకునే పరిస్తితి లేదు. కారణం ఈ కార్యాలయం వ్యవహారాలు మొత్తం ప్రభుత్వ అధికారుల చేతిలో కాకుండా ప్రైవేట్ వ్యక్తుల చెప్పు చేతుల్లో ఉందనడానికి నేడు జరిగిన సంఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కార్మికులు వివిధ పనుల నిమిత్తం ఈ కార్యాలయానికి వస్తే ఎప్పుడో ఒకప్పుడు చుక్క కనిపించినట్లు అధికారులు కనిపిస్తున్నారని ఎక్కువ శాతం ఆఫీసులో అధికారులు సిబ్బంది కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై స్థానిక అధికారులు మరియు జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకుపోయిన పట్టించుకున్న పాపన్న పోలేదు. కాగా ఫైరవిలు ఉంటానే ఇక్కడి అధికారులు పట్టించుంటున్నారని, లేకుంటే లేదని పలువురు కార్మిక శాఖ లబ్ధిదారులు, బాధితులు ఆరోపిస్తున్నారు. ఫైరవీ వాళ్ళు చెప్పిందే చేస్తున్నారని నిజమైన లభ్ది దారులు ఉచితంగా కావాల్సిన పనులు జరగడం లదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇక్కడ పనిచేస్తున్న అధికారుల మీద జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు తీసుకోవాలి…!

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మిడిదొడ్డి శ్రీనివాస్..

హుజురాబాద్ సహాయ కార్మిక శాఖ అధికారి కార్యాలయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏ ఎల్ ఓ, కార్యాలయ సిబ్బంది పై సమగ్ర విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మొలుగు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వెళ్లే కార్మికులకు ఎలాంటి పనులు చేయకుండా పైరవీ ఉన్నవాళ్ళకు, లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గురువారం ఆఫీసు సమయంలో న్యాక్ ఉద్యోగినంటూ ఒక వ్యక్తి ఆఫీసులోని ఫైళ్లను అక్రమంగా తీసుకెళ్తున్నాడని చెప్పారు. ఆఫీసును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి, సమయపాలన పాటించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఏఎల్వో కార్యాలయ అధికారి, సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!