28-06-2024 NORMAL NEWS 02:47 AM
swarnodayam.com
Telugu Daily News
28-06-2024 02:47 AM By Mandala Yadagiri

ఘనంగా భారతరత్న పివి జయంతి వేడుకలు

ఘనంగా భారతరత్న పివి జయంతి వేడుకలు
IMG-20240628-WA0081

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బహుముఖ ప్రజ్ఞాశాలి, దేశానికి విభిన్న రంగాల్లో విశిష్ట సేవలను అందించిన భారత మాజీప్రధాని పివి 103 వ జయంతి వేడుకలు
పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించి స్వీట్లు పంచారు. పివి సేవాసమితి, అలయన్స్ క్లబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. బహుభాషా కోవిధుడు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన మాజీ ప్రధాని మన పివి అని పివి సేవా సమితి అధ్యక్షుడు తూము వెంకటరెడ్డి అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బెల్లి రాజయ్య, అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు బి మనోజ్, Dr టి.విద్యాసాగర్, విశ్రాంత PD కె.రాజిరెడ్డి, కె.సధానందం, పీవీ ట్రస్ట్ కన్వీనర్ వి.గోపాలరావుతో పాటు పంజాల సుధాకర్, రావుల తిరుపతిరెడ్డి, కాసర్ల శ్రీహరి, సాగి శివప్రసాదరావు,
ముక్కెర కన్నయ్య, పసుల స్వామి, చంద్రశేఖర్, ఓంనమశివాయ, కుమారస్వామి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!