Social 1080×1350 • Multi-page
29-06-2024 BREAKING NEWS 09:34 AM
swarnodayam.com
Telugu Daily News

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
IMG-20240629-WA0109

స్వర్ణ ఉదయం ప్రతినిధి, జగిత్యాల: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టును సందర్శించారు. శనివారం ఉదయం కొండగట్టు చేరుకున్న పవన్ అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన కొండగట్టు చేరుకున్నారు. కొండగట్టుకు చేరుకునే మార్గం మధ్యలో పెద్ద ఎత్తున అభిమానులు పవన్ కు స్వాగతం పలికారు. కొత్తపల్లి క్రాస్ రోడ్స్ దగ్గర జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ను గజమాలతో సత్కరించారు. పవన్ టూర్ నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.

డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎన్నికలకు ముందు ముడుపులు కట్టిన పవన్, అనుకున్న కోరిక నెరవేరడంతో ఇవాళ ముక్కులు చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ఆలయానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవటంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. దర్శనం అనంతరం తిరిగి రోడ్డు మార్గాన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. కాగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగిత్యాల ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!