29-06-2024 NORMAL NEWS 12:44 PM
swarnodayam.com
Telugu Daily News
29-06-2024 12:44 PM By Mandala Yadagiri

ఫ్లాష్ ఫ్లాష్..టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్

ఫ్లాష్ ఫ్లాష్..టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్
Screenshot_20240623-184528_Lokal

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: టీ 20 వరల్డ్ కప్-2024 విజేతగా భారత్ నిలిచింది. శనివారం అత్యంత ఉత్కంఠగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న T20WC ఫైనల్లో భారత్ 176/7 రన్స్ చేసింది. దీని ద్వారా T20 వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా భారత్ నిలిచింది. 2021లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మ్యాచ్లో ఆసీస్ చేసిన 173/2 రన్స్ ఇప్పటివరకు అత్యధిక స్కోరు కాగా.. భారత్ ఇవాళ దాన్ని అధిగమించి చరిత్ర సృష్టించింది. 17 సంవత్సరాల తర్వాత భారత్ టి20 వరల్డ్ కప్ సాధించడంతో కోట్లాది మంది భారతీయుల గుండెలు ఆనందంతో ఉప్పొంగాయి. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. 17 సంవత్సరాల అనంతరం యువత ఎంతో చక్కని ప్రతిభ కనబరచి వరల్డ్ కప్ సాధించడంతో భారత్ చరిత్ర సృష్టించింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!