29-06-2024 NORMAL NEWS 01:01 PM
swarnodayam.com
Telugu Daily News
29-06-2024 01:01 PM By Mandala Yadagiri

టి20 వరల్డ్ కప్ విజయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం

టి20 వరల్డ్ కప్ విజయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం
IMG-20240629-WA0140

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: టి20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం రాత్రి హర్షం వ్యక్తం చేశారు.17 ఏళ్ల నిరీక్షణ తరువాత టీ -20 వరల్డ్ కప్ లో భారత్ విజయం పట్ల తనకు సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ బృందానికి అభినందనలు తెలిపారు. భారత్ టి -20 ప్రపంచ కప్ గెలవడం పట్ల దేశ ప్రజలకు , క్రికెట్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం రేపటి భవిష్యత్ క్రీడాకారులను మరింత ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని ఆకాక్షించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!