Social 1080×1350 • Multi-page
29-06-2024 BREAKING NEWS 01:36 PM
swarnodayam.com
Telugu Daily News

టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలియజేసిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్

టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలియజేసిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్
IMG-20240629-WA0140

మండల యాదగిరి, స్వర్ణ ఉదయం ప్రతినిధి హుజురాబాద్: టీ-20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఉత్కంఠ పోరులో గెలిచిన
టీమ్ ఇండియాకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ శుభాకాంక్షలు తెలిపారు. టి20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం పట్ల హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ హర్షం వ్యక్తం చేశారు. 17 ఏళ్ల నిరీక్షణ తరువాత టీ -20 వరల్డ్ కప్ లో భారత్ విజయం పట్ల తనకు సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ బృందానికి అభినందనలు తెలిపారు. భారత్ టి -20 ప్రపంచ కప్ గెలవడం పట్ల దేశ ప్రజలకు, హుజురాబాద్ నియోజకవర్గ క్రికెట్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం రేపటి భవిష్యత్ క్రీడాకారులను మరింత ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని ఆకాక్షించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!