Social 1080×1350 • Multi-page
01-07-2024 BREAKING NEWS 12:15 PM
swarnodayam.com
Telugu Daily News

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా: దివంగత IPS ఉమేశ్ చంద్ర భార్య

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా: దివంగత IPS ఉమేశ్ చంద్ర భార్య
IMG-20240701-WA0130

స్వర్ణోదయం ప్రతినిధి, అమరావతి జులై 01: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టులు, మావోయిస్టులపై ఉక్కు పాదం మోపిన దివంగత ఐపీఎస్ఆఫీసర్ ఉమేశ్ చంద్ర భార్య నాగరాణి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. 1999 సెప్టెంబరు 4న హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ కూడలి వద్ద నలుగురు నక్సలైట్లు ఉమేశ్ చంద్రను కాల్చి చంపారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆయన సేవలకు గౌరవంగా నాగరాణికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. ఆమె పదోన్నతులు పొందుతూ తాజాగా ప.గో. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. నాడు భర్త చనిపోతే ఇచ్చిన గౌరవాన్ని గుర్తుంచుకొని నేడు మళ్ళీ అతని భార్యకు ఒక మంచి పోస్టింగ్ కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడుకి ఉమేష్ చంద్ర అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!