Social 1080×1350 • Multi-page
02-07-2024 BREAKING NEWS 01:48 AM
swarnodayam.com
Telugu Daily News

మంత్రి పొన్నంని కలిసిన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల

మంత్రి పొన్నంని కలిసిన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల
IMG-20240702-WA0075

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లోని అధికారిక నివాసానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పొన్నం సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ నెల 8వ తేదిన విజయవాడలో జరిగే వైఎస్ఆర్ జయంతి వేడుకలకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆమె ఆహ్వానించారు. మొదటిసారిగా వచ్చినందుకు ఆమెకు పొన్నం సతీమణి చీరే సారె పెట్టి ఆశీర్వదించారు. పొన్నం మాతృమూర్తిని పలకరించి కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. దివంగత వైయస్సార్ తో తనకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!