02-07-2024 NORMAL NEWS 08:41 AM
swarnodayam.com
Telugu Daily News
02-07-2024 08:41 AM By Mandala Yadagiri

ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో తొక్కిసలాట.. 27 మంది శివ భక్తులు మృతి.. మరింతగా పెరిగే అవకాశం!?

ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో తొక్కిసలాట.. 27 మంది శివ భక్తులు మృతి.. మరింతగా పెరిగే అవకాశం!?
IMG-20240702-WA0129

స్వర్ణోదయం ప్రతినిధి, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌ లోఈరోజు విషాదం చోటు చేసుకుంది. హత్రాస్‌లో జరిగిన ఓ మత పరమైన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రతీభాన్‌పూర్‌లో మంగళ వారం శివుడికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముగియగానే స్థానికులు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వెళ్లారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో సుమారు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఇటా మెడికల్‌ కాలేజీకి తరలించారు. ఇక మృతుల సంఖ్య పెరిగే ఆవకాశం ఉండడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయాలనుకున్నాయి. నిర్వాహకులపై పోలీసులు సుమోడగా కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!