Social 1080×1350 • Multi-page
03-07-2024 BREAKING NEWS 06:42 AM
swarnodayam.com
Telugu Daily News

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడాలి.. జిల్లా ఉత్తమ సామాజిక కార్యకర్త నలుబల వేణుగోపాల్ పిలుపు.

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడాలి.. జిల్లా ఉత్తమ సామాజిక కార్యకర్త నలుబల వేణుగోపాల్ పిలుపు.
IMG-20240703-WA0118

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ప్లాస్టిక్ రహిత సమాజo కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని జిల్లా ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డు గ్రహీత నలుబాల వేణుగోపాల్ పిలుపునిచ్చారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలో అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవంను పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ బట్ట సంచులను వాడాలని ఆయన పట్టణంలో పలుచోట్ల తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం వల్ల మన భవిష్యత్ తరాలు అనేక నష్టాలకు గురవుతారని అన్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ ను వాడడం ప్రజలు ఇప్పటికైనా క్రమక్రమంగా తగ్గించుకోవాలన్నారు. వాడిన ప్లాస్టిక్ ను భూమిపై పారవేయడం వల్ల అవి పూర్తిగా నాశనం కాకుండా ఉండి విష తుల్యమవుతున్నాయని, వాటి వల్ల రాబోయే తరాలకు ఇబ్బంది అవుతుందని తెలిపారు. ప్రభుత్వం సైతం భవిష్యత్ తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ నిషేధాన్ని పగడ్బందీగా అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం చట్టాలు మాత్రమే చేస్తే ప్లాస్టిక్ వాడటం వల్ల వచ్చే నష్టాలు అవగాహన లేని ప్రజలు పూర్తిగా వాటిని అమలు పరచరని అన్నారు. ప్రజలంతా తమ అవసరాల నిమిత్తం మార్కెట్కు వెళ్లిన వేరే ఇలాంటి పనులకు వెళ్లిన వెంట భక్త సంచలనే తీసుకువెళ్లి బట్టసంచులనే క్యారీ బ్యాగులుగా వాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక అభిమానులు కారంకంటి రవీందర్, పోచంపల్లి రమేష్, నరెడ్ల వినోద్ రెడ్డి, ఆదిమూలం అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!