03-07-2024 NORMAL NEWS 09:04 AM
swarnodayam.com
Telugu Daily News
03-07-2024 09:04 AM By Mandala Yadagiri

ప్రజాసేవ చేసే అవకాశం రావడం గొప్ప విషయం.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

ప్రజాసేవ చేసే అవకాశం రావడం గొప్ప విషయం.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG-20240703-WA0123

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్.
అధికారం ఎవరికి శాశ్వతం కాదు, కానీ పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేసే అవకాశం రావడం అదృష్టం అని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూరాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల పరిషత్ పాలకవర్గ ఆత్మీయ వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు ఎన్నుకోవడం ద్వారా ఐదు సంవత్సరాల పాటు వారికి సేవ చేసే అవకాశం రావడం గొప్పనైనదన్నారు. ఎన్నికల్లో ఎందరు గెలిచినప్పటికీ సేవ చేయడం ద్వారా ప్రజల అభిమానం పొందడం అందరికీ సాధ్యం కాదని పేర్కొన్నారు. మనం గెలిపించిన ప్రజల కోసం పనిచేయడం వల్ల వచ్చే తృప్తి దేనితో రాదని, ప్రజల ఆధారాభిమానాలు ఉంటే అవి ప్రజాప్రతినిధులకు ఎప్పటికైనా అవసరం వస్తుందన్నారు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు అంతా మరోసారి ప్రజల మద్దతుతో తిరిగి ప్రజాప్రతినిధులుగా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఇరుమల్ల రాణి సురేందర్ రెడ్డి, రావుల అనిత వెంకట్, బండి రమేష్, నోముల నాగరాజు, మంతెన శ్రీనివాస్, గద్దల లలిత జయరాజు, కంకణాల వేణుగోపాల్ రెడ్డి, వైద్యుల శిరీష ముకుంద రెడ్డి, గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి, మన్యాల రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!