Social 1080×1350 • Multi-page
04-07-2024 BREAKING NEWS 08:35 AM
swarnodayam.com
Telugu Daily News

మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కమలాపూర్ ఎంపీపీ.. మండల అభివృద్ధికి కృషి చేస్తా..! మంత్రి పొన్నం ప్రభాకర్

మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కమలాపూర్ ఎంపీపీ.. మండల అభివృద్ధికి కృషి చేస్తా..! మంత్రి పొన్నం ప్రభాకర్
IMG-20240704-WA0143

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హన్మకొండ: భీమదేవరపల్లి మండలంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కమలాపూర్ మండలం ఎంపిపి తడ్క రాణి శ్రీకాంత్ గౌడ్ తో పాటు బి ఆర్ ఎస్ పార్టీ నుండి దాదాపు 50 మందికి పైగా ముఖ్యనేతలు , కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు.

– కాంగ్రెస్ పార్టీని బలపర్చండి..

-వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను హుజురాబాద్ లో ఎగురవేయలనీ, ప్రణవ్ కి మరింత బలం చేకూర్చాలని మంత్రి పూర్ణం ప్రభాకర్ ఈ సందర్భంగా సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అన్ని స్థానాల్లో గెలుపొందేలా కృషి చేయాలన్నారు.

–హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ
ఇన్చార్జి వొడితల ప్రణవ్

–అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుదాం..
గ్రామాలలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కొనసాగుదామని, అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపితం చేయడానికి కృషి చేయాలని హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని, రాబోయే లోకల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలం చేసి ప్రతి ఒక్కరిని గెలిపించుకునేలా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, సమస్యలు గ్రామాలలో ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకొని రావాలని వాటిని మంత్రి సహకారంతో పరిష్కరించుకునేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!