Social 1080×1350 • Multi-page
04-07-2024 BREAKING NEWS 11:00 PM
swarnodayam.com
Telugu Daily News

మార్నింగ్ వాక్ లో పాల్గొన్న హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్…వాకర్స్ సౌకర్యార్థం ట్రాక్ ఏర్పాటుకు హామీ

మార్నింగ్ వాక్ లో పాల్గొన్న హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్…వాకర్స్ సౌకర్యార్థం ట్రాక్ ఏర్పాటుకు హామీ
IMG-20240705-WA0015

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఈరోజు శుక్రవారం ఉదయం హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ మైదానంలో మార్నింగ్ వాక్ లో పాల్గొని వాకర్స్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హుజురాబాద్ హై స్కూల్ గ్రౌండ్ లో ప్రతినిత్యం వందలాదిమంది ప్రజలు వాకింగ్ చేస్తూ ఉంటారని, వారి సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని లైటింగ్, డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆదే విధంగా వారు చెప్పిన ప్రతి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాననీ ప్రణవ్ పేర్కొన్నారు. హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు.
ఈ సందర్భంగా పలువురు వాకర్స్ గ్రౌండ్ సంబంధించిన సమస్యలను ప్రణవ్ కి వివరించారు. డ్రైనేజీతో పాటు ట్రాక్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్, సోల్లు బాబు, కొలిపాక శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, ఖాజీపేట శ్రీనివాస్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, హుజురాబాద్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్, మిడిదొడ్డి శ్రీనివాస్, సొల్లు థశరథం, తాళ్ళపెల్లి రమేష్, ప్రతాప్ నాగరాజు, కందుల సందీప్, సదానందం, కె.ఆర్, మండ సాయి, గణేష్, రమేష్, రాఘవేంద్ర, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గోవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!