Social 1080×1350 • Multi-page
05-07-2024 BREAKING NEWS 05:51 AM
swarnodayam.com
Telugu Daily News

ఔటర్ రింగ్ రోడ్డుపై పార్థీ గ్యాంగ్ హల్‌చల్.. పోలీసుల చేజింగ్, గాలిలో కాల్పులు..!

ఔటర్ రింగ్ రోడ్డుపై పార్థీ గ్యాంగ్ హల్‌చల్.. పోలీసుల చేజింగ్, గాలిలో కాల్పులు..!
IMG-20240705-WA0092

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో వరుస దోపిడీలతో జనాన్ని గడగడలాడిస్తున్న పార్టీ గ్యాంగ్ శుక్రవారం తెల్లవారుజామున హైదారాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై హల్ చల్ సృష్టించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నల్లగొండ పట్టణంలో చోరీకి పాల్పడి ఓఆర్ఆర్ మీదుగా పారిపోతున్న దొంగలను నల్లగొండ సీసీఎస్ పోలీసులు వెంబడించారు. అయితే, పార్టీ గ్యాంగ్ కంటపడిన వెంటనే వారిని పట్టుకునేందుకు ఓఆర్ఆర్ పై సినిమా లెవెల్లో ఛేజింగ్ చేశారు. ఒకనొక దశలో పార్థీ గ్యాంగ్ దాడికి తెగబడటంతో పోలీసులు గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. ఈ క్రమంలో నలుగురు దొంగలను వారు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పెట్రోల్ బంకులు, ఇల్లు, బ్యాంకులు దోచుకోవడంలో పార్థీ గ్యాంగ్ ఆరితేరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆ గ్యాంగ్ పై పదుల సంఖ్యలు కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ గా పార్ది గ్యాంగ్ పోలీసుల హిట్ లీస్ట్ లో ఉంది. అదుపులోకి తీసుకున్న వారి ద్వారా మొత్తం కూపి లాగితే పెద్ద ఎత్తున వారి దోపిడీలు, దొంగతనాలు ఇతర ఆగడాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!