Social 1080×1350 • Multi-page
05-07-2024 BREAKING NEWS 06:12 AM
swarnodayam.com
Telugu Daily News

కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధంఖబర్దార్ కౌశిక్ రెడ్డి…దళిత బహుజన నాయకుల హెచ్చరిక.

కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధంఖబర్దార్ కౌశిక్ రెడ్డి…దళిత బహుజన నాయకుల హెచ్చరిక.
IMG-20240705-WA0093

స్వర్ణోదయం ప్రతినిధి, చిగురుమామిడి, జూలై 5: హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి జిల్లా పరిషత్ సమావేశములో మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ పై చేసిన అనుచిత వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని దళిత బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి మాటలకు నిరసనగా చిగురుమామిడి మండల కేంద్రములో బస్టాండ్ వద్ద ధర్నా నిరహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి పార్లమెంటరీ విధానం మీద గౌరవం లేదని, వీధి రౌడీలా చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. బలహీన వర్గాలంటే చులకన భావమన్నారు. గీకురు రవీందర్ పోలీస్ నౌకరి వదిలి పెట్టి తెలంగాణ ఉద్యమం చేసినవాడని, కస్టపడి రాజకీయంగా ఎదిగి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే నాయకుడని అన్నారు. ఉద్యమ కారుల మీద రాళ్లు రువ్వి, స్వార్త రాజకీయం, పదవుల కోసం పార్టీ మారిన చరిత్ర కౌశిక్ రెడ్డిదని, ఉద్యోగాలు పెట్టిస్తానని డబ్బులు వసూలు చేసిన మోసకారివని దుయ్య బట్టారు. ఎమ్మెల్యేగా గెలిపించకుంటే కుటుంబ సభ్యులం సామూహికంగా విషం తాగి చస్తామని బ్లాక్ మెయిల్ చేసి గెలిచినోడివని ఏద్దేవా చేశారు. మా బహుజన బిడ్డకు బేషరుతుగా క్షమాపణ చెప్పకుంటే గ్రామల్లో తిరుగనివ్వమని, దళిత బహుజనులం నీ రాజకీయ గోరీ కడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి అంజయ్య, బోయిని వంశీకృష్ణ, జిల్లా ఫిషరీష్ డైరెక్టర్ జక్కుల బాబు, సొసైటీ అధ్యక్షులు చెరుకు సంజీవ్ కుమార్, గట్టు శ్రీనివాస్, పెసరు శ్రీనివాస్, దొబ్బల బాబు, బొమ్మగాని వెంకటేష్ గౌడ్, గందే రమేష్, కూరెళ్ళ కిషోర్, గట్టు రంజిత్, కూన బిక్షపతి, గట్టు సతీష్, గాజుల రాజు, పొగాకు రమేష్, గుజ్జుల రాజు, పొన్నం వెంకట్రాజయ్య, పొన్నం కనకయ్య, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!