Social 1080×1350 • Multi-page
05-07-2024 BREAKING NEWS 07:25 AM
swarnodayam.com
Telugu Daily News

సదాశివ్ సేవలు అభినందనీయం..! -గోడిశాల హెచ్ఎం పణ్యానాయక్.

సదాశివ్ సేవలు అభినందనీయం..! -గోడిశాల హెచ్ఎం పణ్యానాయక్.
IMG-20240705-WA0121

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అలాంటి వృత్తిలో ఉండి సదాశివ్ సార్ విద్యార్థులకు అందించిన సేవలు అభినందనీయమని గుడిశాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పణ్యానాయక్ పేర్కొన్నారు. శుక్రవారం గోడిశాల పాఠశాలలో (sgt)ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ ఉన్నతి పొంది ఇదే మండలంలోని అమ్మనగుర్తి పాఠశాల ప్రధానోపధ్యాయునిగా బదిలీ అయిన టీచర్ మండల సదాశివ్ వీడ్కోలు సన్మాన మహోత్సవం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వహించి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసినట్లయితే ఎక్కడికి వెళ్లినా పేరు ప్రతిష్టలు దక్కుతాయని సూచించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం ఒక ఉపాధ్యాయులకే ఉంటుందని అలాంటి ఉపాధ్యాయులు సమాజ మార్గదర్శకులుగా మారి విద్యార్థులకు చక్కని విద్యా బోధన అందించాలని సూచించారు. అనంతరం ఎంపీపీ ఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు శశికళ బదిలీ కాగా సదాశివ్ తో పాటు శశికల ను కూడా పూల పూకే అందించి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్పర్సన్ మోత్కు రజిత, పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!