Social 1080×1350 • Multi-page
07-07-2024 BREAKING NEWS 05:23 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఘనంగా ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ వేడుకలు

హుజురాబాద్ లో ఘనంగా ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ వేడుకలు
IMG-20240707-WA0100

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, హుజురాబాద్:


ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 30 వసంతాలు పూర్తయిన సందర్భంగా మరియు మహాజన నేత మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా హుజురాబాద్ అంబేద్కర్ చారస్తాలో ఎంఎస్ పి జిల్లా అధ్యక్షులు తునికి వసంత్, Mrps జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి రవీందర్ మాదిగల ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జెండాను ఎగురవేశారు. తర్వాత కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం హాజరై మాట్లాడుతూ.. మాదిగల ఆత్మగౌరవం కోసం షెడ్యూల్డ్ కులాల ఉమ్మడి రిజర్వేషన్లలో కులాల జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కాలని లక్ష్యంతో 30 సంవత్సరాల క్రితం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏర్పడిందన్నారు. ఆనాటి నుండి ఎన్నో వీరోచితమైన పోరాటాలు చేసి పాలకులను ఒప్పించి ఎస్సీ వర్గీకరణ కోసం మూడుసార్లు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాలు చేసిందని గుర్తు చేశారు. అదేవిధంగా జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్లు వర్గీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చినప్పటికీ పాలకుల నిర్లక్ష్యం వల్ల వర్గీకరణ కార్యరూపం దాల్చుక్క పోవటం వల్ల మాదిగ ఉపకులాల విద్యార్థులకు విద్య ఉద్యోగాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుందని వివరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వర్గీకరణ బిల్లు పార్లమెంటులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో msp రాష్ట్ర నాయకులు మారాపెల్లి శ్రీనివాస్ మాదిగ, సీనియర్ mrps నాయకులు రేణుకుంట్ల సాగర్ మాదిగ, బాబు జగ్జీవన్ రామ్ జయంతి కమిటీ చైర్మన్ రొంటాల సుమన్, సైదాపూర్ మాజీ ఎంపీపీ పోలిశెట్టి వెంకటరాజం, ఎంఐఎఫ్ గౌరవ అధ్యక్షుడు వేల్పుల రత్నం, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, కలవల మల్లయ్య, ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు రొంటాల రాజకుమార్ మాదిగ, ఉద్యోగుల సమాఖ్య జాతీయ నాయకులు మొలుగురి మొగిలి , రిటైర్డ్ హెడ్ పోస్ట్ మాస్టర్ ఇల్లందుల సమ్మయ్య , ముక్క రామస్వామి , బత్తుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!