08-07-2024 NORMAL NEWS 02:04 AM
swarnodayam.com
Telugu Daily News
08-07-2024 02:04 AM By Mandala Yadagiri

తెలంగాణలో కార్పొరేషన్ పదవుల పంపకం..తెలంగాణలో కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల

తెలంగాణలో కార్పొరేషన్ పదవుల పంపకం..తెలంగాణలో కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల
FB_IMG_1719992695443

మొత్తం 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డికి నిరాశ

సన్నోదయం ప్రతినిధి, హైదరాబాద్: దశాబ్దకాలంగా అధికారంలో లేక పదవులు పొందలేక, పనులు చేసుకోలేక అవస్థలు పడ్డ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఈ సారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఎన్నో ఆశలు పెంచుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అందుకు తగ్గట్టే అధికారం చేపట్టిన నెల రోజుల్లో నామినేటెడ్‌ పదవుల భర్తీ దృష్టి సారించి.. 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ఎంపిక చేశారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అధిష్ఠానం అనుమతితో వారి నియామకాలకు అంతా సిద్ధం చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో కోడ్‌ అమల్లోకి వచ్చి.. ఆ నియామకాలకు సంబంధించి ఉత్తర్వుల జారీ ఆగిపోయింది. నేడు 35 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై జీవో విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది.

జీవో వచ్చేసింది..

35 మంది చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

ఎవరికి ఏ పదవి..?

కో ఆపరేటివ్‌ ఆయిల్‌ సీడ్స్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి

మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌గా జబ్బార్‌

సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా అలేఖ్య పుంజాల

మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఈరవత్రి అనిల్‌

కూడా(KUDA) కార్పొరేషన్ చైర్మన్‌గా ఇనగాల వెంకట్రామిరెడ్డి

గ్రామీణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా చల్లా నర్సింహారెడ్డి

టీఎస్‌ ఐఐసీ చైర్మన్‌గా జగ్గారెడ్డి భార్య నిర్మలా జగ్గారెడ్డి

ఫారెస్ట్‌ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పొదెం వీరయ్య

ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌గా కాల్వ సుజాత

పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గురునాథ్‌రెడ్డి

ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కాసుల బాలరాజు

విత్తనాభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా అన్వేష్‌రెడ్డి

రాష్ట్ర సహకార సంఘం చైర్మన్‌గా మానాల మోహన్‌రెడ్డి

గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నాగేశ్వరరావు

ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌

మత్స్యసహకార సమాఖ్య చైర్మన్‌గా మెట్టు సాయి కుమార్‌

గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌గా రియాజ్‌

మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా శోభారాణి

దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా ఎం. వీరయ్య

బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నూతి శ్రీకాంత్‌

ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎన్‌.ప్రీతం

ఎస్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బెల్లయ్య నాయక్‌

గిరిజన కార్పొరేషన్‌ చైర్మన్‌గా కె. తిరుపతి

ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జైపాల్‌

కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్‌గా జనక్‌ ప్రసాద్‌

నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా విజయ్‌బాబు

స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌గా శివసేనారెడ్డి

వాణిజ్య ప్రోత్సాహక కార్పొరేషన్‌ చైర్మన్‌గా ప్రకాశ్‌రెడ్డి

సాంకేతిక సేవల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మన్నె సతీష్‌

పట్టణ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్‌గా చల్లా నరసింహారెడ్డి

శాతవాహన పట్టాణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కె.నరేందర్‌రెడ్డి

కాకతీయ పట్టాణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఈ. వెంకటరామిరెడ్డి

రహదారి అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మల్‌రెడ్డి రామిరెడ్డి

తెలంగాణ టూరిజం సంస్థ చైర్మన్‌గా పటేల్‌ రమేశ్‌రెడ్డి

తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా ఎం.పి. ఫహిమ్‌

నేడే బాధ్యతలు..!

నేడు బాధ్యతలు తీసుకోనున్న పలువురు కార్పొరేషన్ చైర్మన్లు

పలు కార్పోరేషన్లకు గతంలో ఛైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం

పలు కార్పోరేషన్‌లకు నేడు జీవో విడుదల చేసిన ప్రభుత్వం

మైనింగ్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా నేడు భాధ్యతలు స్వీకరించనున్న ఈరవత్రి అనీల్

కూడా(KUDA) కార్పోరేషన్ ఛైర్మన్‌గా భాధ్యతలు స్వీకరించనున్న ఇనగాల వెంకట్రామిరెడ్డి

అర్బన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా భాధ్యతలు స్వీకరించనున్న చల్లా నర్సింహారెడ్డి..

మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డికి నిరాశ

షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డికి మరోసారి నిరాశ ఎదురయింది. కార్పొరేషన్ చైర్మన్ పదవి లభిస్తుందనే హామీతో చాలాకాలం నుండి ఆయన ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించి తీసుకొచ్చారు. ప్రతాప్ రెడ్డి రాజకీయ అభివృద్ధిపై భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా ఇంటికి రావడం పార్టీలోకి ఆహ్వానించడం ఆ తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలామందిని బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చారు.
అయితే మొదటిసారి కార్పొరేషన్ పదవుల పంపిణీలో ప్రతాప్ రెడ్డికి అవకాశం దక్కలేదు. తాజాగా రెండోసారి విడుదలైన కార్పొరేషన్ పంపకాల జాబితాలో కుడా ప్రతాప్ రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన అభిమానులు నిరాశకు గురవుతున్నారు. గత ఎన్నికల్లో స్థానిక అసెంబ్లీలో వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యేగా గెలిచేందుకు చాలా కృషి చేశారు. ఆ తర్వాత చల్లా వంశీ చంద్ రెడ్డి గెలుపు కోసం నియోజకవర్గంలో ప్రచారం చేశారు. పార్టీకి మెజార్టీ అంది వచ్చేలా కూడా చేశారు. కానీ పదవుల పందేరంలో మాత్రం ప్రతాప్ రెడ్డి వెనుకబడిపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నిన్న ఆయన జన్మదిన వేడుకలు కూడా స్థానికంగా జరుపుకోలేదు. పదవి వస్తుందన్న గంపెడు ఆశతో ఆయన ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ అనేక కార్పొరేషన్ పదవుల్లో పలువురు నాయకులకు పెద్దపీట వేయగా ప్రతాప్ రెడ్డి రాజకీయ భవితవ్యం మాత్రం ఇంకా అంధకారంలోనే ఉంది.. కేపి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!