Social 1080×1350 • Multi-page
08-07-2024 BREAKING NEWS 07:12 AM
swarnodayam.com
Telugu Daily News

జర్నలిస్ట్ గా విష్ణువర్ధన్ సేవలు మరువలేనివి..!

జర్నలిస్ట్ గా విష్ణువర్ధన్ సేవలు మరువలేనివి..!
IMG-20240708-WA0252

-జర్నలిస్ట్ విష్ణు దశదినకర్మలకు హాజరైన ఎమ్మెల్యే కవ్వంపల్లి…
వోడితల ప్రణవ్

మండల యాదగిరి స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: పి.సి.సి.మెంబర్ పత్తి కృష్ణారెడ్డి సోదరుడు హుజురాబాద్ ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పత్తి విష్ణువర్ధన్ రెడ్డి దశదిన కర్మలను పురస్కరించుకొని జమ్మికుంటలో ఏర్పాటుచేసిన కార్యక్రమంకి మానకొండూరు కాంగ్రెస్ శాసనసభ్యుడు, డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ సోమవారం హాజరయ్యారు. జర్నలిస్టు పత్తి విష్ణువర్ధన్ రెడ్డి దశదిన కర్మలను పి.సి.సి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి నిర్వహించగా, ఈ కార్యక్రమానికి కవ్వంపల్లి సత్యనారాయణ. వోడితల ప్రణవ్ మరియు కాంగ్రెస్ నాయకులు కర్యర్తలతో కలిసి విష్ణు వర్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మృతుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభతిని తెలియజేశారు. పాత్రికేయ రంగంలో విష్ణువర్ధన్ రెడ్డి అందించిన సేవలు ఎన్నటికీ మరువలేనివని, ఆయన చిన్నవయసులోనే అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. వారి వెంట హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాలు నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, హుజురాబాద్ జమ్మికుంట ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయి నివాళులర్పించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!