Social 1080×1350 • Multi-page
09-07-2024 BREAKING NEWS 07:53 AM
swarnodayam.com
Telugu Daily News

“గానకోకిల” పురస్కారానికి వడ్లకొండ అనిల్ కుమార్ ఎంపిక

“గానకోకిల” పురస్కారానికి వడ్లకొండ అనిల్ కుమార్ ఎంపిక
IMG-20240709-WA0113(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ ఉద్యమ గాయకుడు, ధూమ్ ధాం కళాకారుడు వడ్లకొండ అనిల్ కుమార్ “ఉద్యమ గానకోకిల” పురస్కారంకు ఎంపిక చేసినట్లు ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేకల చంద్రశేఖర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ముక్కెర సంపత్ కుమార్ లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యమాలకు, పోరాటాలకు ఆయువు పట్టయిన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో సహజ వనరులు, నిధులు, ఇసుక, క్వారీ, బొగ్గు, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయని అన్నారు. ఈ ప్రాంత ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ, సంపదను ఇతర ప్రాంతాలకు తరలించడం అన్యాయమని అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత వనరుల పరిరక్షణ కొరకే తమ సంస్థ ఏర్పాటు చేశామని అన్నారు. ఈనెల 12న కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆవిర్భావ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులకు సన్మానం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గాయకుడిగా వడ్లకొండ అనిల్ కుమార్ ఎంతో పేరు గడించాడని, అందుకే అతనికి ఈ పురస్కారానికి ఎంపిక చేశామని తెలిపారు. కాగా ఉద్యమ గాన కోకిల అవార్డుకి ఎంపికైన అనిల్ కుమార్ మిత్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా తనను పురస్కారానికి ఎంపిక చేసిన మెకల చంద్రశేఖర్ యాదవ్ కి, ప్రధాన కార్యదర్శి ముక్కెర సంపత్ కుమార్ అనిల్ కుమార్* ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!