Social 1080×1350 • Multi-page
09-07-2024 BREAKING NEWS 08:29 AM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా ఏబీవీపీ 76వ ఆవిర్భావ వేడుకలు

ఘనంగా ఏబీవీపీ 76వ ఆవిర్భావ వేడుకలు
IMG-20240709-WA0138

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 76వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం హుజురాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఏబీవీపీ ఆవిర్భావం నుంచి విద్యా సమస్యలపై పోరాడుతూ ఏ విధంగా ముందుకు సాగుతుందో ఏబీవీపి నాయకులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కూల్ అజయ్, నగర ఉపాధ్యక్షులు శివ కార్తీక్, శివ, నగర సంయుక్త కార్యదర్షులు అరుణ్, వరుణ్, రామ్ చరణ్, నగరా హాస్టల్ కన్వీనర్ అభిలాష్, జశ్వంత్, నగర కార్యవర్గ సభ్యులు కౌశిక్, అఖిల్, సంజయ్, విద్యార్థులు తదితరలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!