Social 1080×1350 • Multi-page
10-07-2024 BREAKING NEWS 12:20 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ టౌన్ సిఐ గా ఎర్రల కిరణ్

హుజురాబాద్ టౌన్ సిఐ గా ఎర్రల కిరణ్
IMG-20240710-WA0089

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ టౌన్ సిఐ గా ఎర్రల కిరణ్ కు పోస్టింగ్ ఇచ్చినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ఇక్కడ సిఐగా పనిచేస్తున్న బొల్లం రమేష్ ను సిద్దిపేట ఎస్బి సీఐ గా బదిలీ అయినట్లు సమాచారం. సిద్దిపేట ఎస్ బి సిఐ గా పనిచేస్తున్న ఎర్రల కిరణ్ ను హుజురాబాద్ టౌన్ కు బదిలీ కాగా ఈయన గతంలో హుజురాబాద్ రూరల్ సీఐగా సమర్థవంతంగా పనిచేసిన అనుభవం ఉంది. గత శాసనసభ ఉప ఎన్నికల సమయంలో ఎన్నికల బదిలీలో భాగంగా హుస్నాబాద్ కు వెళ్లగా మళ్లీ తిరిగి హుజురాబాదుకు రానున్నారు. బొల్లం రమేష్ హుజురాబాద్ సిఐగా 2023 జనవరి 1న బాధ్యతలు స్వీకరించగా నాటి నుంచి నేటి వరకు టౌన్ సీఐగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన గన్ మెన్ గా పనిచేసిన కానిస్టేబుల్ అవినాష్ సీఐ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో సిపి కానిస్టేబుల్ ను సిపి కి అటాచ్ చేసింది విధితమే. అయితే ఇటీవల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి -కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ ఇద్దరు మండలంలోని చెల్పూర్ హనుమాన్ దేవాలయంలో ప్రమాణం చేసేందుకు సవాల్, ప్రతి సవాలు విసురుకోగా అధికార పార్టీలో ఉన్న నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ ను గృహనిర్బంధం చేయడం, సంఘటన స్థలానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేసి దురుసుగా ప్రవర్తించడంతో అదేరోజు కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల సీఐ ఆదేశాలతోనే రాత్రి పది తర్వాత చిరు వ్యాపారుల షాపులను బలవంతంగా బంధు చేయించడం, రోడ్డుపై కనిపించే వారిపై దురుసుగా ప్రవర్తించడం లాంటివి పోలీసులు చేయడంతో దీని మొత్తానికి టౌన్ సిఐ బాధ్యుడిగా భావించి ఇటీవల ఓ చిరు వ్యాపారి సిపి కి, మానవ హక్కుల కమిషన్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేగాక ఎంపీ ఎన్నికల ముందు టౌన్ సిఐ రమేష్ ను బదిలీ చేసి ఆయన స్థానంలో రాంబాబు అనే సీఐని నియమించగా సదరు సీఐ రాంబాబు సీపీకి తెలియకుండా నేరుగా రిపోర్ట్ చేయడంతో సిపి అతనిని జైనింగ్ చేసుకోవడంలో ససేమీరా అన్నారు. ఈ విధంగా సిఐ బదిలీకి అప్పుడు సీపీ అటుపడినప్పటికీ ఇప్పుడు అతని బదిలీకి పలు కారణాలు ఉండడంతో గుట్టు చప్పుడు కాకుండా ఒక్కసారిగా కేవలం హుజురాబాద్ టౌన్ సిఐని మాత్రమే బదిలీ చేస్తూ ఆయన స్థానంలో హుజురాబాద్ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉన్న ఎర్రల కిరణ్ ను నియమించడం శుభ పరిణామంగా పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే టౌన్ సిఐ గత రెండు మూడు రోజులుగా లీవ్ లో ఉండడంతో సిబ్బంది కూడా తిరిగి రాడు అన్న సంకేతాలను సన్నిహితులకు ఇచ్చారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండానే తన ప్రవర్తనతోనే తాను బదిలీ కావడం పట్టణంలో చర్చనీయాంశముగా మారింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!