11-07-2024 NORMAL NEWS 02:46 AM
swarnodayam.com
Telugu Daily News
11-07-2024 02:46 AM By Mandala Yadagiri

ఈ నాన్న మాకు వద్దు….! మూడు రోజులకే కన్న బిడ్డలను వదిలి వెళ్ళిన తండ్రి

ఈ నాన్న మాకు వద్దు….! మూడు రోజులకే కన్న బిడ్డలను వదిలి వెళ్ళిన తండ్రి
IMG-20240711-WA0061

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన సోమ సారయ్య సత్తమ్మ దంపతులు కలరు. వీరికి ఇద్దరి సంతానం. 2010 సంవత్సరంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ఫలితంగా భార్య సత్తమ్మను నెట్టివేయడంతో క్రింద పడి మృతి చెందింది. ఈ సమయంలో కుమార్తె పూజ వయసు ఐదు సంవత్సరాలు, కుమారుడు బన్నీ వయసు మూడు సంవత్సరాలు. కోర్టులో కుమార్తె పూజ చెప్పినా సాక్ష్యం మేరకు సోమ సారయ్యకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వచ్చింది. చిన్నారులను చూసుకునేందుకు అప్పటి సీఐ సుందరగిరి శ్రీనివాసరావు ప్రత్యేక చొరవ తీసుకొని జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి స్పందన అనాధ శరణాలయం నిర్వాహకులు, గోపగాని వీరస్వామికి వీరి బాధ్యతలు చూసుకోవాలని అప్పగించారు. అప్పటినుండి ఆలనా పాలనా చూసుకుంటూ పెంచి పెద్ద చేయగా ప్రస్తుతం పూజ డిగ్రీ చదువుతుండగా, బన్నీ ఇంటర్ చదువుతున్నాడు. సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను ఈనెల మూడున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా అందులో సోమ సారయ్య కూడా ఉన్నాడు. చిన్నతనంలో స్పందన అనాధ శరణాలయంలో వదిలివేసిన తన పిల్లల వద్దకు వచ్చి ఇకనుండి వారి ఆలనా పాలనా చూసుకుంటానని వారిని నమ్మించి జమ్మికుంట శ్రీరాములపల్లి వెళ్లే గ్రామాల మధ్య ఓ ఇంటిని తీసుకొని అక్కడే రెండు రోజులపాటు ఉన్నారు. మూడవరోజు పిల్లలతో హైదరాబాదు నుండి ఫోను వచ్చింది అకౌంట్లో డబ్బులు తీసుకోవాలి అని నమ్మించి వెళ్లిపోయాడు. రెండు రోజుల అనంతరం పనికి ఫోన్ చేసి మీతో నాకు సంబంధం లేదు. మీరు నాకు పుట్టలేదు.. మీ సర్టిఫికెట్ లో కూడా నా పేరు ఉండకూడదని, హైదరాబాదులోనే మరొక వివాహం చేసుకొని పిల్లలను కని వారికి నా ఆస్తిని అప్పగించుతానని తెలియజేశాడు. దీంతో ఒtకరోజు పాటు ఆ అద్దె ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ బాధపడుతూ చివరకు ఆశ్రమ నిర్వాహకుడు వీరస్వామి వద్దకు వెళ్లి జరిగిందంతా తెలియజేశారు. పెద్ద మనసుతో వారిని హక్కును చేర్చుకొని వారి పోషణ బాధ్యతలు తానే చూసుకుంటానని, నమ్మించి పిల్లలను మోసం చేసిన కసాయి తండ్రిని తిరిగి వచ్చిన పిల్లలు అంగీకరించనంటూ చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ 14 సంవత్సరాల తర్వాత మా దగ్గరికి వచ్చిన నాన్న మాటలు నమ్మి వెళ్లామని రెండు రోజుల తర్వాత తన కసాయి బుద్ధిని చూపెట్టి నాన్న అనే మాటకే కళంకం తెచ్చేలా ప్రవర్తించాడని రోదిస్తూ తెలిపింది. ఆశ్రమంలో పెరుగుతున్న ఇద్దరి అనాధల పట్ల ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!