Social 1080×1350 • Multi-page
11-07-2024 BREAKING NEWS 03:51 AM
swarnodayam.com
Telugu Daily News

ఇంచార్జీ ఏజీపీగా గుర్రం శ్రీనివాస్ గౌడ్

ఇంచార్జీ ఏజీపీగా గుర్రం శ్రీనివాస్ గౌడ్
IMG-20240711-WA0102

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

హుజురాబాద్ సీనియర్ సివిల్ జడ్జీ కోర్టు మరియు జూనియర్ సివిల్ జడ్జీ కోర్టులకు ఇంచార్జీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా గుర్రం శ్రీనివాస్ గౌడ్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. శంకరపట్నం మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ గతంలోనూ కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు రెండు పర్యాయాలు ఏజీపీగా పని చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వొడితెల ప్రణవ్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు శ్రీనివాస్ గౌడ్ ను అభినందించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!