Social 1080×1350 • Multi-page
11-07-2024 BREAKING NEWS 05:17 AM
swarnodayam.com
Telugu Daily News

బండి జన్మదిన సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్కులు, పెన్నులు పంపిణీ..!

బండి జన్మదిన సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్కులు, పెన్నులు పంపిణీ..!
IMG-20240711-WA0105

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు మరియు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ 53వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ మరియు ప్రాథమిక పాఠశాలలో భారతీయ జనతా యువమోర్చా సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పిల్లలకు నోటు బుక్కులు మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా నాయకుడు మట్ట పవన్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, అమ్మవారి ఆశీస్సులతో రానున్న కాలంలో కరీంనగర్ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటూ.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైయం సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డితో పాటు గ్రామ బూత్ అధ్యక్షుడు ఉప్పుల శ్రీనివాసరెడ్డి, నాయకులు ఈరబోయిన సతీష్, బండి రాజు, పోలు సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!