Social 1080×1350 • Multi-page
12-07-2024 BREAKING NEWS 04:03 AM
swarnodayam.com
Telugu Daily News

చెట్లను ప్రతి ఒక్కరు నాటాలి..ముందు చూపుతో మాజీ సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారు..హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

చెట్లను ప్రతి ఒక్కరు నాటాలి..ముందు చూపుతో మాజీ సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారు..హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG-20240712-WA0109

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎంతో ముందు చూపుతో మాజీ సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని, హరితహారం కార్యక్రమాన్ని కొనసాగించడం పట్ల సంతోషంగా ఉందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, కమలాపూర్, జమ్మికుంట, ఇల్లందకుంట, హుజురాబాద్ మండలాల్లో పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. హరితహార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించడం చాలా సంతోషకరమైనదని అన్నారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ ముందు చూపుతో హరితహారం కార్యక్రమం చేపట్టడం ద్వారా ఎంతో మేలు జరిగిందని, గత ప్రభుత్వం హరితహారం కోసం చాలా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. చెట్లను పెంచడం ద్వారా పల్లెల్లో పచ్చదనంతో ఎంతో ఉల్లాసంగా ఉంటుందని, చెట్లు నాటడంతో మనిషి జీవనానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. చెట్ల ద్వారా వచ్చే గాలి స్వచ్ఛమైనదని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అన్నారు. ప్రతి ఒక్కరు చెట్లు నాటాలన్నారు. చల్లూరు గ్రామంలో హరితవనాన్ని 21 వేల మొక్కలను మామిడి జామతో పాటు అనేక చెట్లను నాటడం జరిగిందని, హరితహారం కార్యక్రమం గతంలో భాగంగా మోడల్ పార్క్ లాంటి పకృతివనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అవార్డు తీసుకున్న చల్లూరు ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఆర్డీవో రమేష్, ఎంపీడీవో సునీత, ఎఫ్ ఆర్ ఓ నాగేశ్వరరావు, ఎఫ్ ఎస్ఓ సునీత, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఏనుగు సత్యనారాయణ రెడ్డి, తుమ్మనపల్లి మాజీ సర్పంచ్ గూడూరు ప్రతాపరెడ్డి, మాజీ ఎంపిటిసి యాదయ్య ఈశర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ సంఘం ఐలయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!