Social 1080×1350 • Multi-page
12-07-2024 BREAKING NEWS 08:03 AM
swarnodayam.com
Telugu Daily News

జర్నలిస్టులపై దాడులు సరైనవి కావు..అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు విజయ్ గణేష్.

జర్నలిస్టులపై దాడులు సరైనవి కావు..అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు విజయ్ గణేష్.
IMG-20240712-WA0153

స్వర్ణోదయం ప్రతినిధి, సిద్దిపేట12 జూలై: హైదరాబాద్ ఓయూలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ వీడియో జర్నలిస్టులపై పోలీసుల దాడులను అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు విజయ్ గణేష్ తీవ్రంగా ఖండించారు..సిద్ధిపేటలో అయన మాట్లాడుతూ.. ప్రజా పాలన పై ప్రశ్నించినందుకు జర్నలిస్టులపై దాడులు చేయడం ఆమానుషం అని అన్నారు. జర్నలిస్టులపై దాడులు నశించాలని ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటని ఏంటని ప్రశ్నించారు. రక్షణ కల్పించాల్సిన రక్షక బటులే ఉన్నతమైన పదవిలో ఉండి జర్నలిస్టుపై దుర్భాషలాడం సమంజసం కాదని తెలిపారు వీరు సామాన్య ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తారని అన్నారు. గత ప్రభుత్వంలో ఏనాడు జర్నలిస్టులపై దాడులు జరగలేదని ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉంటు తమ కుటుంబాలను లెక్కచేయకుండా విధి నిర్వహణలో రేయి పగలు కష్టపడుతున్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని విజయ్ గణేష్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏబిజేఎఫ్ ప్రధాన కార్యదర్శి పోతరాజు రమేష్, కోశాధికారి వేముల కుమార్, ఉపాధ్యక్షులు జనగామ సతీష్, మరియు జర్నలిస్టులు దుద్దెడ అశోక్ గౌడ్, పోతుల మల్లేష్, కె. సుదర్శన్, బొడ్డు సంపత్, నరిశెట్టి మల్లేషం లు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!