12-07-2024 NORMAL NEWS 08:19 AM
swarnodayam.com
Telugu Daily News
12-07-2024 08:19 AM By Mandala Yadagiri

వారిని స్వయంగా కేసీఆరే పంపుతున్నారు… చేరికలపై బండి హాట్ కామెంట్స్

వారిని స్వయంగా కేసీఆరే పంపుతున్నారు… చేరికలపై బండి హాట్ కామెంట్స్
IMG-20240712-WA0160

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్, జూలై 12: బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌‌లోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ చేరికలకు సంబంధించి కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వయంగా కేసీఆర్ .. సొంత ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఏకైక గ్యారంటీ నరేంద్ర మోదీ అని తెలిపారు. అవినీతి నుంచి బయట పడేందుకు కాంగ్రెస్‌‌కు కేసీఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. సెక్యూరిటీ లేకుండా.. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని సవాల్ విసిరారు. నిరుద్యోగులను పోలీసుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేస్తోందని కేంద్ర మంత్రి మండిపడ్డారు. రాహుల్ గాంధీని సొంత పార్టీ వారే ప్రధాని అభ్యర్థిగా అంగీకరించలేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు పెద్ద పీఠ వేస్తుందన్నారు. బీజేపీ కార్యకర్తల గెలుపే రాష్ట్ర బీజేపీ నాయకత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీతో తెలంగాణ ప్రజలు మోసపోయారన్నారు. కాంగ్రెస్‌ను ప్రజలు వ్యతిరేకించారనటానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా నరేంద్ర మోదీ మాత్రమే గ్యారంటీ అంటున్నారన్నారు. ధర్మం, తెలంగాణ పేదల కోసం పోరాడేది బీజేపీ మాత్రమే అని చెప్పుకొచ్చారు. బీజేపీ కార్యకర్తల పోరాటం వలనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8సీట్లు వచ్చాయన్నారు. రైతులను మోసం చేసే విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!