Social 1080×1350 • Multi-page
12-07-2024 BREAKING NEWS 11:08 AM
swarnodayam.com
Telugu Daily News

అక్రమ అబార్షన్లు చేసిన మాధవి నర్సింగ్ హోమ్ సీజ్..భ్రూణ హత్యలపై ప్రభుత్వం సీరియస్!నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు.జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ సుజాత

అక్రమ అబార్షన్లు చేసిన మాధవి నర్సింగ్ హోమ్ సీజ్..భ్రూణ హత్యలపై ప్రభుత్వం సీరియస్!నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు.జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ సుజాత
Screenshot_20240712-214745_Video Player

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అక్రమ అబార్షన్లు చేస్తూ సమాజానికి తలవంపులు తెచ్చిన హుజురాబాద్ పట్టణంలోని శ్రీ మాధవి నర్సింగ్ హోమ్ ను కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి జిల్లా వైద్య శాఖ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణలోనే సంచలనం కలిగిన భ్రూణ హత్యలపై ప్రభుత్వం సీరియస్ కావడంతో హుటాహుటిన జిల్లా వైద్య శాఖ అధికారీ డాక్టర్ సుజాత, ఎంసి హెచ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సనా జువేరియా, హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ బి చందు లు పోలీసుల సహాయంతో పట్టణంలోని శ్రీ మాధవి నర్సింగ్ హోమ్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రికార్డులను తనిఖీ చేశారు. స్కానింగ్ రూమ్ ,ల్యాబ్ , బెడ్స్ ఇతర గదులను తనిఖీ చేసి నిబంధనల ప్రకారం లేవని గుర్తించారు. ఆస్పత్రి ముందు ప్రదర్శించిన డాక్టర్ల పేర్లు, ఆసుపత్రికి వచ్చే డాక్టర్ల పేర్లకు సరిపోవడంలేదని తేలింది. రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిన డాక్టర్లకు బదులుగా వేరే వారు వస్తున్నారని స్పష్టమైనది. బాత్రూములు, రోగులు ఉండే గదులు ఇతర గదులు సక్రమంగా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి నిర్వహణ సక్రమంగా లేకపోవడమే కాకుండా, రికార్డులు కూడా పూర్తి చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్స్ సుజాత మాట్లాడుతూ… డి ఆర్ ఏ చట్టం ప్రకారం ఆసుపత్రులు నిర్వహించుకోవాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ ప్రైవేటు ఆసుపత్రులు నడుపుతున్నట్లు ఆరోపణలు వస్తే వాటిని సీట్ చేయడానికి వెనుకాడేది లేదని అన్నారు. అక్రమ అబార్షన్ల రాకెట్ లో ముగ్గురు అరెస్టై రిమాండ్ కు వెళ్లారని, ఈ ప్రక్రియలో పాల్గొన్న వైద్యురాలు ఎవరు అనేది విచారణ జరుగుతుందని ఆమె తెలిపారు. విచారణ అనంతరం సదరు డాక్టర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. హుజురాబాద్ జమ్మికుంట ప్రాంతాలలోని ఆసుపత్రుల యజమానులు నిబంధనల ప్రకారం నడపలేకపోతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు. జిల్లాలో, హుజురాబాద్ డివిజన్లో ఆస్పత్రుల తనిఖీ కోసం ప్రత్యేక బృందాలు పరిశీలన చేస్తాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ రంగారెడ్డి, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ కాంతారావు , హుజురాబాద్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాజిద్ హుస్సేన్ డిస్టిక్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
-శ్రీ దుర్గా ఆసుపత్రి తనిఖీ

హుజురాబాద్ పట్టణంలోని మాధవి నర్సింగ్ హోమ్ తనిఖీ అనంతరం పక్కనే ఉన్న శ్రీ దుర్గా ఆసుపత్రిని డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సుజాత, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందులు తనిఖీ చేశారు. పట్టణంలో వెలసిన సుమారు 50 కి పైగా ప్రైవేటు దావకానాలన్నింటిని పరిశీలించి అనుమతి లేని వాటికి నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!