Social 1080×1350 • Multi-page
13-07-2024 BREAKING NEWS 06:23 AM
swarnodayam.com
Telugu Daily News

దళిత బంధు రెండో విడుత వెంటనే విడుదల చెయ్యాలి..మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్

దళిత బంధు రెండో విడుత వెంటనే విడుదల చెయ్యాలి..మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్
IMG_20231124_181949

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దళిత బంధు రెండో విడుత డబ్బులను వెంటనే విడుదల చెయ్యాలనీ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం హుజురాబాద్ లోని ఆయన నివాసంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే అతి పేద కుటుంబాలు అంటే దళిత కుటుంబాలే అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు వారి కుటుంబాలను ఉపాధి ద్వారా ఆదుకోవాలని ఒక ఆలోచనతో దళిత బంధు పథకాన్ని రూ. 10 లక్షల ఆర్థిక సహాయంతో బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా వారికి ఎలాంటి షరతులు లేకుండా ఈ పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. ఇందులో దాదాపుగా 18,021 మంది దళిత కుటుంబాలు ఈ పథకానికి అర్హులయ్యారనీ, ఈ కుటుంబాలకు గత ప్రభుత్వంలో దళిత బంధు మొదటి విడతగా ఒక్కొక్కరికి సుమారు 5 లక్షల రూపాయలు మొదటి విడతగా ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో కొంతమంది వాహనాలను, మరికొంతమంది షాపులను, డైరీ ఫామ్ ఈ పథకం ద్వారా వినియోగించడం జరిగిందన్నారు.2023 అక్టోబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు రావడం ద్వారా ఈ పథకానికి సంబంధించిన రెండో విడత ఎలక్షన్ కమిషన్ ఆపివేయడం జరిగిందనీ గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల ఇచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దళితులకు 12 లక్షలు ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్న కనీసం 12 లక్షలు ఇవ్వకపోగా రెండో విడతగా వారి అకౌంట్లో ఉన్న డబ్బులను ఫ్రీజ్ చేయించి రెండో విడతను దళితులకు ఇవ్వకుండా వారిని ఇబ్బందులు పెడుతున్నారనీ ఆరోపించారు. రెండో విడత డబ్బులు రాక వారిలో కొంతమంది వాహనాలకు బాడీ కట్టించుకోలేని పరిస్థితి బండి నడిస్తేనే గాని ఆ కుటుంబాలకు తిండి దొరకని పరిస్థితి మరికొంతమంది వారి షాపులకు అద్దె కట్టలేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి దళిత బంధు రెండో విడతను విడుదల చేయాలని దళితుల పక్షాన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ను నియమించకపోవడం ఇప్పుడు నియమించిన తర్వాత కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని ఆయన అన్నారు. లేనిచో తెలంగాణ రాష్ట్రం మొత్తం దళితులతో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు, మోరె మధు, మంద రాజేష్, శంకర్, చంద్రమౌళి, రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!