Social 1080×1350 • Multi-page
13-07-2024 BREAKING NEWS 07:58 AM
swarnodayam.com
Telugu Daily News

చెల్పూర్ వెంకన్నకు ‘ఉద్యమ గానకోకిల’ అవార్డు ప్రదానం

చెల్పూర్ వెంకన్నకు ‘ఉద్యమ గానకోకిల’ అవార్డు ప్రదానం
IMG-20240713-WA0169

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ధూమ్ ధామ్ కళాకారుడు, జానపద కళారంగంలో ప్రతిభ కనబర్చిన హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన పుల్ల వెంకన్నను జిల్లా ప్రెస్ భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఉధ్యమ గాన కోకిల అవార్డ్ ప్రధానం చేశారు. గత కొన్నేళ్లుగా కళాకారుడిగా తనదైన శైలిలో ఎన్నో ఉద్యమ గీతాలు ఆలపించడంతో పాటు ప్రజలను చైతన్యపరిచేందుకు సామాజిక సాంఘిక రుగ్మతల తొలగింపు కోసం తన వంతుగా తన గాత్రంతో చైతన్య పరుస్తున్న వెంకన్న గొప్ప కళాకారుడని అందుకే గాన కోకిల అవార్డుకు ఎంపిక చేసి అవార్డును అందజేయడం జరిగిందని నిర్వాహకులు సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ అధ్యక్షుడు మేకల చంద్రశేఖర్ యాదవ్ ప్రధాన కార్యదర్శి ముక్కెర సంపత్ కుమార్ ,టీవీ సినీ గేయ గాయకుడు రచయిత మురళీ మధు తదితరులు పాల్గొని సత్కరించారు. ఈ సత్కారంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని పుల్ల వెంకన్న తెలిపారు. తనను గాన కోకిల అవార్డుతో సత్కరించిన నిర్వాహకులకు వెంకన్న కృతజ్ఞతలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!