Social 1080×1350 • Multi-page
15-07-2024 BREAKING NEWS 10:43 AM
swarnodayam.com
Telugu Daily News

కాంగ్రెస్‌లో చేరిన పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్

కాంగ్రెస్‌లో చేరిన పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్
IMG-20240715-WA0204

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ జులై15: బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోమ వారంసాయంత్రం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళా యాదవ్‌తో పాటు పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మహిపాల్‌రెడ్డితో పాటు జహీరాబాద్‌ బీఆర్‌ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌తో పాటు పలువురు కార్పొ రేటర్లు, ఆయన అనుచ రులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

మహిపాల్‌రెడ్డి 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. వరుసగా రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్‌ను ఓడించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 7వేల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఇటీవల ఆయన ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈయన బాటలోనే మరికొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!