Social 1080×1350 • Multi-page
16-07-2024 BREAKING NEWS 01:55 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో అగ్ని ప్రమాదానికి గురైన వ్యాపార సముదాయాన్ని సందర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలి… బాధితులకు నష్టపరిహారం అందించాలి..బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి…

హుజురాబాద్ లో అగ్ని ప్రమాదానికి గురైన వ్యాపార సముదాయాన్ని సందర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలి… బాధితులకు నష్టపరిహారం అందించాలి..బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి…
IMG-20240716-WA0125

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా కూడలిలో అగ్ని ప్రమాదానికి గురైన చిరు వ్యాపార సముదాయాన్ని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, స్థానిక హుజురాబాద్ బిజెపి పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు ఇతర నాయకులు కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ప్రధానంగా పండ్ల వ్యాపారుల దుకాణాలతో పాటు ఇతరత్రా షాపులు అగ్ని ప్రమాదానికి గురవడంతో మంగళవారం ఉదయం ఘటన స్థలాన్ని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పరిశీలించి వ్యాపారులకు సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు, పండ్ల వ్యాపారుల షెడ్లు అగ్ని ప్రమాదానికి గురవడం విచారకరమన్నారు. చిరు వ్యాపారాల పండ్ల దుకాణాలకు సోమవారం రాత్రి నిప్పంటుకుని దుకాణాలు కాలిపోవడంతో ఇక్కడి వ్యాపార సముదాయ ప్రాంతం పూర్తిగా మంటల్లో చిక్కుకపోయిందని, ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వారందరికీ తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందన్నారు. ప్రమాద సంఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడటం జరిగిందని, ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నష్టపోయిన వ్యాపారులందరికీ తగిన న్యాయం చేయాలని కోరడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కౌన్సిలర్ లు పైళ్ల వెంకట్ రెడ్డి, నల్ల సుమన్, జిల్ల కార్యదర్శి బింగి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు ,ఓబీసీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు రావుల వేణు , జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్ , ఉపాధ్యక్షులు సబ్బని రమేష్, యాంషాని శశిధర్ , ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు గంట సంపత్ , ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు బోరగాల సారయ్య, నాయకులు తిరుపతి, కోలిపాక వెంకటేష్ ,దేవేందర్,నరాల రాజశేఖర్ ,గుర్రం సంతోష్, హరీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిన్న రాత్రి జరిగిన పండ్ల దుకాణాల అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పైళ్ల వెంకటరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి తుర్పాటి రాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రావుల వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, ఉపాధ్యక్షులు యళ్ల సంజీవరెడ్డి, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు గంట సంపత్, శక్తి కేంద్ర ఇన్చార్జి కొలిపాక వెంకటేష్, బూత్ అధ్యక్షులు దేవేంద్ర, అయిత సందీప్, ఆవుల సదయ్య, కుసుమ సమ్మయ్య, క్యాస వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!