Social 1080×1350 • Multi-page
16-07-2024 BREAKING NEWS 02:30 AM
swarnodayam.com
Telugu Daily News

బాధితులకు అండగా నిలిచిన సామాజిక వేత్త సబ్బని వెంకట్– హుజురాబాద్ లో షార్ట్ సర్క్యూట్ బాధాకరం– చిరు పండ్ల వ్యాపారులకు అండగా ఉంటానని హామీ

బాధితులకు అండగా నిలిచిన సామాజిక వేత్త సబ్బని వెంకట్– హుజురాబాద్ లో షార్ట్ సర్క్యూట్ బాధాకరం– చిరు పండ్ల వ్యాపారులకు అండగా ఉంటానని హామీ
IMG-20240716-WA0118

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని సోమవారం అర్థరాత్రి ప్రమాదవశాత్తు జరిగిన షార్ట్ సర్క్యూట్ లో చిరు వ్యాపారులైన పండ్ల బండ్ల దుకాణ దారులకు చెందిన తోపుడు బండ్లు, ఇతర వ్యాపారస్తుల సామాగ్రి పూర్తిగా దగ్ధం కావడంతో విషయం తెలిసిన వెంటనే హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ సామాజిక వేత్త, జెన్ ప్యాక్ట్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ స్పందించి తన సానుభూతిని తెలియజేశారు. వారి బాధలో ఒక భాగమై బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించుకుని నష్టపోయిన పండ్ల బండ్ల వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.5,000( ఐదు వేల చొప్పున ) ఆర్థిక సహాయం ప్రకటించారు. సమయ భావన వలన రాలేకపోతున్నాని బాధను వ్యక్త పరుస్తూ స్వయంగా తానే బాధితులను కలుస్తానని తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!