Social 1080×1350 • Multi-page
16-07-2024 BREAKING NEWS 11:08 AM
swarnodayam.com
Telugu Daily News

సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ హాకీ పోటీలకు సెలెక్ట్ అయిన ఆరుగురు క్రీడాకారులు.

సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ హాకీ పోటీలకు సెలెక్ట్ అయిన ఆరుగురు క్రీడాకారులు.
IMG-20240716-WA0187

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన ఆరుగురు హాకీ క్రీదాకారులు సెకండ్ తెలంగాణ హాకీ సబ్ జూనియర్ సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ పోటీలకి సెలెక్ట్ అయ్యారు. సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ లో భాగంగా కేరళ రాష్ట్రంలోని కోళ్లంలో జరిగే సౌత్ జోన్ హాకీ క్రీడాలలో పాల్గొనడానికి ఈ రోజు మంగళవారం హుజురాబాద్ నుండి బయలు దేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం నుండి సౌత్ జోన్ సబ్ జూనియర్ హాకీలో సెలెక్ట్ కావడానికి పూర్తి సహకారాలు అందించిన కోచ్ తిరుణహరి శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు ఎం విక్రమ్, వంశీ, రాజు లకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. సెలెక్ట్ అయిన వారిలో హుజురాబాద్ కు చెందిన బొమ్మకంటి దత్తప్రియ, తాళ్లపల్లి మేఘన, జంపాల శివ సంతోషిని, గోలి నిపుణత బాలికల నుండి, అలాగే బాలుర నుండి ముద్దంగుల రామ్ చరణ్, తమ్మిశెట్టి శశాంక్ సౌత్ జోన్ హాకీ సబ్ జూనియర్ ట్రోఫీలో తెలంగాణ జట్టుకు ఎంపికయ్యారు. వీరికి పలువురు హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు. కాగా హుజురాబాద్ హాకీకి పుట్టినిల్లు లాంటిది. ఇక్కడ నుండి ఎంతో మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారు. ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గతంలో హుజురాబాద్ లో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు జరిగేవి. ఆ విధంగానే మళ్లీ నిర్వహించాలని పలువురు హాకీ క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!