Social 1080×1350 • Multi-page
17-07-2024 BREAKING NEWS 01:43 AM
swarnodayam.com
Telugu Daily News

రేపు తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని మూడవ రహస్య గది!?

రేపు తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని మూడవ రహస్య గది!?
IMG-20240717-WA0078

స్వర్ణోదయం ప్రతినిధి, ఒడిశా, జులై 17: ఒడిశాలోని పూరీ జగన్నా ధుని శ్రీ క్షేత్రరత్న భాండాగారం రహస్య గది తలుపులు గురువారం తెరుచుకోనున్నాయి. ఇందుకు రేపు ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. దీంతో దేశమంతా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తోంది. శ్రీక్షేత్ర కార్యాలయంలో మంగళవారం భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సమావేశం అనంతరం జస్టిస్‌ రథ్, ఆలయ పాలనాధికారి అరవింద పాఢి విలేకరులతో మాట్లాడుతూ ‘ఈ నెల 14న భాండాగారంలోని తొలి రెండు గదుల్లో ఉన్న పురుషోత్తముని సంపద బయటకు తీసి తాత్కాలిక స్ట్రాంగ్‌రూంకు తరలించామన్నారు. ఇదంతా వీడియోగ్రఫీ చేయించాం. ఈనెల 18న రహస్య గదిని తెరిచి, అందులోని సంపదను మరో తాత్కాలిక స్ట్రాంగ్‌ రూంలో భద్రపరుస్తాం. అనంతరం ఈ భాండాగారాన్ని పురావ స్తు శాఖకు మరమ్మతుల నిమిత్తం అప్పగిస్తామన్నారు.

పనులు పూర్తయ్యాక సంపదనంతా మళ్లీ రహస్య గదికి తెచ్చి, ఆభరణాల లెక్కింపు చేపడతామని వెల్లడించారు. రహస్య గది తెరుస్తున్న కారణంగా శ్రీక్షేత్రంలోకి గురువారం ఉదయం నుంచి భక్తుల ప్రవేశాన్ని నిలిపి వేసినట్లు ఆలయ పాలక మండలి ప్రకటించింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!